త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా నూతన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కె. లలితా దేవి విధుల్లో చేరారు. ఇక్కడ పనిచేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పదవి విరమణ పొందడం వల్ల రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ హనుమకొండ జిల్లాలో ప్రోగ్రామ్ ఆఫీసర్ (డిటిటి) గా పనిచేస్తున్న డాక్టర్ లలితా దేవి ని వికారాబాద్ జిల్లా నూతన DMHO గా నియమించడం జరిగినది. విధులలో చేరిన అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ ని, అడిషనల్ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుదీర్ లను కలవడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


