ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Door-to-door campaign

Door-to-Door Campaign : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్: జూలై 29 ; రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్లన్న ర పరిపాలనలో నమ్మకం అభివృద్ధి, సంక్షేమం ప్రచార కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో బాపులపాడు మండలం, రంగన్నగూడెం గ్రామంలో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి సమర్ధవంతంగా చేరుస్తున్నారు .

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం-2 పథకం, ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పెంపు తదితర సంక్షేమ పథకాలను విజయవంతంగా ఈ రెండేళ్ళలో విజయవంతంగా అమలు చేయటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో జలవనరుల రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఈ రెండు సంవత్సరాల్లో 24 వేల కోట్లు ఖర్చుచేసి 36ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయటానికి ప్రణాళిక రూపొందించిందని ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చి కృష్ణాడెల్లా లోని పంటలను కాపాడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించిన సూపర్ సిక్స్ లో భాగంగా మల్లవల్లి పారిశ్రామికవాడలో ఉద్యోగాల రూపకల్పన, పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి ఏలూరు కాలువకు గోదావరి జలాలను తీసుకువెళ్ళే లింకు చానల్ కు 38 కోట్లు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపచేయటం కేసరపల్లిలో హెచ్.సి. ఎల్. ఫౌండేషన్ ద్వారా ఎ.ఐ.ఎం.ఎల్. ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం, ఏలూరు కాలువ ఆయకట్టును బుడమేరు వరదల నుండి కాపాడటానికి ఎనికేపాడు అండర్ టన్నెల్ సామర్థ్యం 5వేల క్యుసెక్కుల నుండి 25వేల క్యుసెక్కులకు పెంచటానికి 36 కోట్లు నిధులు సాధించి విజయవంతంగా అమలు చేశారని వివరించారు.

ఈ కార్యక్రమంలో రంగన్నగూడెం గ్రామ టి.డి.పి. అధ్యక్షులు పల్లగాని వీరంజనేయులు, ఎం.పి.టి.సి. సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, ఎం.పి.సి.ఎస్. అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, బూత్ లెవల్ ఏజంట్ కసుకుర్తి వేణుబాబు, టి.డి.పి. నాయకులు తుమ్మల దశరథ రామయ్య, కసుకుర్తి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page