త్రినేత్రం న్యూస్: ఐవిఆర్ఎస్ ద్వారా రాజమండ్రి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. కార్మిక చట్టాలప్రకారం గ్యాస్ డెలివరీ కార్మికులకు మంచి అగ్రిమెంటు చేయిస్తాం. నగరంలోని గ్యాస్ డెలివరీ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “దీపం” పథకంలో ఇళ్ళకు సిలెండర్ ఇచ్చినప్పుడు డెలీవరీ చార్జీలు తీసుకోవద్దని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) గ్యాస్ డెలివరీ కార్మికులకు సూచించారు. శనివారం నగరంలోని గ్యాస్ డెలివరీ కార్మికులతో సమావేశం అయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ దీపం పథకంలో గ్యాస్ పొందిన వారినుంచి ఐవిఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించిందని ఆ సమయంలో దీపం లబ్దిదారులు గ్యాస్ డెలివరీ బాయ్ డెలీవరీ చార్జీలు తీసుకున్నట్లు ఫీడ్ బ్యాక్ ఇచ్చారని,ఈ సమాచారం తనకు ఇబ్బంది కలిగించిందని అన్నారు.కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం పథకంలో ఇకపై గ్యాస్ డెలివరీ చేసేటప్పుడు దయచేసి డెలీవరీ చార్జీలు తీసుకోవద్దని ఆయన కోరారు.
గ్యాస్ డెలివరీ కార్మికుల ఇబ్బందులు, సమస్యలు తనకు తెలుసని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదని కాని దీపం పథకం సిలిండర్లు ఉచితంగా డెలీవరి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. గ్యాస్ డెలివరీ కార్మికులకు మెరుగైన అగ్రిమెంటు చేయించడానికి తనవంతు కృషి చేస్తానని, ఇప్పటికే ఆయా గ్యాస్ ఏజెన్సీల యజమానులతో మాట్లాడానని వారంతా సానుకూలంగా ఉన్నారని ఆయన అన్నారు.కార్మిక శాఖ అధికారులతో కూడా చర్చలు జరిపామని గ్యాస్ డెలివరీ కార్మికులకు పీఎఫ్, ఇఎస్ఐ, ఇతర బెనిఫిట్స్ ఆన్నీ అందేలా అధికారులు కూడా కృషి చేస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు.గ్యాస్ డెలివరీ కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ కూటమి నాయకులు నల్లం శ్రీను, నందివాడ దినేష్, ఇతర నాయకులు గ్యాస్ డెలివరీ కార్మికులకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, నాయకులు మరుకుర్తి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


