మే 2 నుండి రాష్ట్ర మన్యం నిరవధిక బంద్ కు పిలుపు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయాలి. లేదా ప్రెసిడెంట్స్ ఉత్తర్వులు ఏప్రిల్ 30నాటికి జారీ చేయాలి.
టి. ఏ.సి తీర్మానం అమలు ప్రక్రియ పెండింగ్ లో ఉండగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లను అమలు చేయాలి.
ఏప్రిల్ 30న డీఎస్సీ అభ్యర్ధులు ఐ.టి.డి. ఏ వద్ద ధర్నా.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ అమలు సాధ్యమేనని,తక్షణమే ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ జారీ కి ఆర్డినెన్స్ లేదా ప్రెసిడెన్సీ ఉత్తర్వులు ఏప్రిల్ 30నాటికి జారీచేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కుడుముల కాంతారావు ప్రతిపాదించిన భవిష్యత్ కార్యాచరణ, తీర్మానను చర్చ వేదిక ఆమోదించింది. చర్చ వేదిక కు అధ్యక్షత బి.టి. ఏ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వల్ల వెంకట రమణ వహించారు.
తీర్మానంలో పేర్కొన విధంగా 111వ బ్రైటల్ అడ్వాయిజరీ కమిటీ సమావేశం 18-6-2020న 5వ షెడ్యూల్డ్ క్లాజ్ -2 ప్రకారంగా నూరుశాతం ఉద్యోఉపాధ్యాయ నియమాక రిజర్వేషన్ పునరుద్ధరణపై ప్రభుత్వం చర్యలు తీసుకవాలనే ప్రతిపాదనను తేది. 23-7 2021 న జరిగిన112 వ టిఎసీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అడ్వకేట్ జనరల్ వద్ద నుండి న్యాయ సలహా కోసం ఫైల్ నెం. 14121(32/ 24-2021న ఫైనల్ ఒపినీయనికి పంపడం జరిగింది.అయిన నాడు జగన్ ప్రభుత్వం ప్రకటించిన 6000డీఎస్సీ పోస్టులు కానీ,
నేటి 2025 మెగా డిఎస్సీలో ఆదివాసీలకు తీవ్ర నష్టం జరిగింది.
2025 ఏప్రిల్ 20న రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించి ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేసింది. కాని 5వ షెడ్యూల్డ్ఏరియాలో 100 శాతం రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఆదివాసీ యువతకుతీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 400 పోస్టులకు గానుఎస్టీలకు కేవలం 24 పోస్టులు మాత్రమే కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్డ్ ఏరియా ఐటిడిఏ పరిధిల్లో 766 పోస్టులకు గాను,ఎస్టీలకు కేవలం 42 పోస్టులు మాత్రమే కేటాయించారు. ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ విద్యా సంస్థలకు కేటాయించిన రాష్ట్ర వ్యాప్తంగాటీచర్ పోస్టులు 4680. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 161 పోస్టులు మాత్రమే ఎస్టీలకు కేటాయించారు.
గిరిజన గురుకులంజోన్ -1, జోన్ -2 పరిధిల్లో 748 గిరిజన గురుకులం టిజిటి, పిజిటి, పి.డి, పిఇటి పోస్టులలో 45 పోస్టులు మాత్రమే ఎస్టీలకుకేటాయించారు. ప్రభుత్వ చర్య వల్ల ప్రమోషన్లు పొందవలసిన టీచర్లకు, ఇప్పడు వరకు విధులు నిర్వహిస్తున్న సిఆర్ లు, గెస్ట్లెక్చరర్స్తో పాటు ఆదివాసీ నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. సిఆర్డీలు, గెస్ట్ లెక్చరర్స్ను తొలగిస్తారు. ఆదివాసీలకు6శాతం, నాన్ ట్రైబ్స్కు 94% పోస్టులు కేటాయించడం ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగింది.ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టుల్లో నాన్ ట్రైబల్స్ ఇతర ప్రాంతాల నుండి ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి విధులునిర్వహిస్తున్నారు. దీంతో ఆగకుండా ఏజెన్సీ ప్రాంతంలో జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ మరియు ఎంపిపి పదవులో గిరిజనేతరులతన్నుకుపోయి రాజకీయ రిజర్వేషన్ పొంది ఏజెన్సీ ప్రాంతాన్ని వారి గుప్పిట్లో పెట్టుకొని సహజ సంసద దోచుకోవడానికి 1/70 చట్టాన్ని, అటవీహక్కుల చట్టాన్ని, పీసా చట్టాలను రద్దుచేయడం లేదా సవరించడం జరుగుతాయి.
ఇప్పటికే 1/70 చట్టాన్ని సవరించి గిరిజనేతరులకు ఏజెన్సీలో భూమి, అటవీపై అధికారం కల్పించాలని, సుప్రీంకోర్టులో కేసు దాఖలై వుంది. రాష్ట్రంలో వున్నప్రజాప్రతినిధులు ఆదివాసీ చట్టాలను సవరించాలనే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆదివాసీ ప్రజాసంఘాల రాష్ట్ర మన్యం బందుస్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజన చట్టాలను సవరించమని, నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ ఎస్టీలకుకల్పిస్తామని ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికి మూడు సార్లు ఆదివాసీ డిఎస్సీపై హామీచ్చి మెగా డిఎస్సీతో ముఖ్యమంత్రి పుట్టిన రోజున ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం చేశారు. తక్షణమే ఆదివాసీ స్పెషల్ నోటిఫికేషన్ విడుదలకై ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం జారీచేయాలి.- నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్పై రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలుచేయాలి, ఏజెన్సీ ప్రాంతా విద్య సంస్థల్లో టీచర్స్ పోస్ట్లు మెగా డీఎస్సీ లో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చర్చ వేదిక తీర్మానించింది.
భవిష్యత్ కార్యాచరణ ప్రకటన.
1). ఏప్రిల్ 27 మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పత్రాలు దగ్దం. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ చేయాలి. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి.
2). ఏప్రిల్ 28న జిల్లా, మండల స్థాయిలో ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ,ప్రజా సంఘాల,రాజకీయ పార్టీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం.
బంద్ జయప్రదానికి సన్నాహాలు.
జిల్లా, మండల స్థాయిలో ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ నియామకం.
ఏప్రిల్ 30 న జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ధర్నా కు యువత సమీకరణ.
3). గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కి వినతి పత్రం సమర్పణ.
4). రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్య శాఖ మంత్రి లకు ఇమెయిల్, సోషల్ మీడియా ద్వారా వినతిపత్రం.
5). రాష్ట్ర గవర్నర్ కి వినతిపత్రం సమర్పణ.
6). మే 2 న అన్ని మండలం లో వేలాది మంది తో బంద్ నిర్వహించాలి.
ఈ కార్యక్రమం లో అరకు ఎంపీ తనూజా రాణి, ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పల నరస, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర , గిరిజన సమ్మక్క జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ గిరిజన సంక్షేమ పరిషత్ ఫ్యాషన్ నాయకులు వంతల నాగేశ్వరరావు,ఆదివాసి సేన నాయకులు రాజబాబు, ఆదివాసి మాతృభాష ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరి చిట్టిబాబు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ జగన్, టిఆర్టి జిల్లా నాయకులు ఉద్యోగ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు కుడుమల కాంతారావు,డి. ఇ . ఓ కేంద్ర కమిటీ సభ్యులు సమారెడ్డి మాణిక్యం, గిరిజన టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కమిటీ నీలకంఠం, టిడిపి పార్టీ జిల్లా నాయకులు పాండురంగ స్వామి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఈ చిన్న స్వామి,భాను సోమేశ్వరరావు, గిరిజన నిరుద్యోగుల సంఘం నాయకులు వై. కుమార్, కూడ సుబ్రహ్మణ్యం, భాను, చట్టు మోహన్, చింతూరు అశోక్ ,తదితరుల పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


