TTD : టీటీడీకి రూ.30 లక్షలు విరాళం

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల, 2026 ఫిబ్రవరి 10: హైదరాబాద్ కు చెందిన స్మార్ట్ సాఫ్ట్ వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీ యలమంచిలి మదన్మోహన్ రావు మంగళవారం టీటీడీకి రూ.30 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. సదరు విరాళాన్ని శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు, ఇతర ట్రస్టులకు వినియోగించాలని దాత చైర్మన్ ను కోరారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Donation of Rs. 30 lakhs to TTD

You cannot copy content of this page

Scroll to Top