First Musical Road : దేశంలో మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు.. ఎక్కడ ప్రారంభం అయ్యిందో.. తెలుసా

TRINETHRAM NEWS

మహారాష్ట్ర : భారత్లో తొలి మ్యూజికల్ రోడ్డు (Indias First Musical Road)ను ప్రారంభించి ముంబయి కోస్టల్ రోడ్ అధికారులు రికార్డు సృష్టించారు. హంగేరియన్ టెక్నాలజీ సాయంతో నారిమన్ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే రహదారిపై పలు సంగీత స్ట్రిప్లను ఏర్పాటు చేశారు.

దీంతో ఈ రోడ్డుపై దాదాపు 700 మీటర్ల మేర వాహనదారులకు ‘స్లమాగ్ మిలియనీర్’ సినిమాలోని ‘జయ హో’పాట వినిపించనుంది. ఈ పాటను దేశానికి అంకితం చేయడానికి, ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంచేందుకు ఈ విధంగా డిజైన్ చేసినట్ల ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 6.21 కోట్ల వ్యయం అయినట్లు అధికారులు వెల్లడించారు.

ముంబయి కోస్టల్ రోడ్ (Mumbai Coastal Road) కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన ఈ రహదారి దేశంలోనే మొదటి మ్యూజికల్ రోడ్డుగా నిలుస్తుందన్నారు. ఇటువంటి మ్యూజికల్ రహదారులు హంగరీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రమే ఉన్నాయని అన్నారు. మహారాష్ట్ర ముఖ్య మంత్రి దీనిని ప్రారంభించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

country's first musical road started

You cannot copy content of this page

Scroll to Top