Mon. Mar 9th, 2026

Invitation Letter to MLA : వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 2: నెల్లూరు జిల్లా :కావలి కచేరి మెట్టలో వెలసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానము నందు జరుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా కావలి అభివృద్ధి ప్రదాత ప్రియతమ శాసనసభ్యులు దగుమాటి.వెంకటకృష్ణా రెడ్డి, చేతులమీదుగా స్వామివారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అవిష్కరించడం జరిగింది.
ఈ సంవత్సరం 31వ బ్రహ్మోత్సవం కార్యక్రమం జరుగుతుంది ప్రియతమ శాసనసభ్యులు దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి , మాట్లాడుతూ గత 30 సంవత్సరములు నుండి ఆధ్యాత్మిక శోభతో గోవింద నామ స్మరణాలతో ఈ ఉత్సవాలు చేయడం మనందరికీ శుభ పరిణామం స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని అటు కొండ బిట్రగుంటలో ఇటు కచేరి మెట్టలో ఒకేసారి ఉత్సవాలు జరగటం చాలా ఆనందదాయకమని ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండమైన రీతిలో ఉత్సవాలు చేస్తున్నారని స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ ప్రజలందరికీ స్వామి వారి కృప కటాక్షాలు ఇస్తున్నారని ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకుని అలాగే ఆలయ కమిటీ వారు కూడా వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తమ తరుపున ఉత్సవాలకు కావలసిన సేవలు అందిస్తామని పోలీసు గాని సానిటరీ గాని విద్యుత్ పరంగా గాని తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు
ఈ కార్యక్రమంలో ఆలయకమిటీపాలక వర్గంఅన్నవరంవెంకటసత్యనారాయణ, నరహరి హరిబాబు, తిరువీధి ప్రసాద్, మారుతీ రావు, హనుమకుమార్, ఆలయ అర్చకులు బుట్టా శేషాచార్యులు, అలహరినరసింహారావుకరుణాకర్, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kavali MLA unveils invitation letter for Venkateswara Swamy Brahmotsavam

Related Post

You cannot copy content of this page