
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 13 : పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ బిజెపి ఎంపి డికె అరుణ బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చాలని వ్యాఖ్యానించడాన్ని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చెర్చీ ఆదివాసీలకు అన్యాయం చేయ్యవద్దని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్రజిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ కేంద్ర ప్రభుత్వనికి డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బోయ వాల్మీకులను గిరిజన జాబిలో చేర్చాలని శ్యామల ఆనంద్ మిషన్ వేసిందనీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని అప్పుడు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడ బోయ వాల్మికీలను గిరిజన జాబితాలో చేర్చాలని ఆమోదించింది బోయవాల్మికి లను గిరిజన జాబితాలో చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది
బోయవాల్మికీలను గిరిజన జాబితాలో చేర్చాలని వైసిపి ప్రభుత్వ అయంలో వేసిన శ్యముల్ ఆనంద్ మిషన్ కు బోయాలను గిరిజన జాబితలొచెర్సవద్దని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి పిర్యాదు చేసింది బోయ వాల్మీకులు గిరిజన జభితలో చేర్సేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూడ కారం శివాజీ నాయకత్వంలో కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానించింది బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చేందుకు కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్ర తెలుగుదేశం ప్రతిపక్ష వైసిపి పార్టీలు ఒకే విధానం అమలు చేస్తుంది బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చొద్దని అదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు ఇల్లులు మంజూరు చేయాలని వ్యాఖ్యానించడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర తీవ్రంగా ఖండించారు షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు ఇల్లులు మంజూరు చెయ్యడం అంటే 1/70 చట్టనికి తూట్లు పొడవడమే అవుతుంది షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనే తరులకు ఇల్లులు మంజూరు చెయ్యద్దనీ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది
1/70 చట్టం ఉండగా షెడ్యూల్ ప్రాంతంలో గిరిజ నేతారులకు ఇల్లులు ఎలా మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని గిరిజన సంఘం ప్రశ్నిస్తున్నది 1/70చట్టాన్ని సవరించలని రాష్ట్ర అసెంబ్లీ సభాపతి ప్రకటన వెనకల 1/70 చట్టం తొలగింపులో భాగంగా రంపచోడరం ఏంఎల్యే అసెంబ్లీ సాక్షిగా గిరిజనేతరులకు ఇల్లు మంజూరు చేయాలని వ్యాఖ్యానించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 1/70 చట్టం రక్షణకు అసెంబ్లీలో హామీనివ్వలని డిమాండ్ చేసారు
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు కె.జగన్నాధం,కె.బుజ్జీ బాబు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
