Divya Deshmukh : చ‌రిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌.. తొలి భార‌తీయ మ‌హిళ‌గా అరుదైన ఘ‌న‌త‌

TRINETHRAM NEWS

ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా దివ్య రికార్డ్‌

సెమీఫైనల్ లో చైనాకు చెందిన తాన్ ఝోంగీని 1.5-0.5 తేడాతో ఓడించిన వైనం

ఈ విజయంతో దివ్య‌కు మొదటి గ్రాండ్ మాస్టర్ (జీఎం) నార్మ్‌

అలాగే 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్
టోర్నమెంట్‌కు కూడా అర్హ‌త

Trinethram News : భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ఆమె సెమీఫైనల్ లో మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ ఝోంగీని 1.5-0.5 తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది.

ఈ విజయంతో ఆమె తన మొదటి గ్రాండ్ మాస్టర్ (జీఎం) నార్మ్‌ను కూడా సాధించింది. మ‌హారాష్ట్ర‌కు చెందిన‌ 19 ఏళ్ల దివ్య తెల్లపావులతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. దీంతో పాటు ఆమె 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు కూడా అర్హ‌త సాధించింది.

ప్రపంచ నంబర్ 18 అయిన దివ్య మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ మొదటి గేమ్‌లో నల్లపావులతో ఆడి డ్రా చేసుకుంది. అయితే, నిన్న జ‌రిగిన రెండో గేమ్‌లో ఆమెకు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Divya Deshmukh, who created

You cannot copy content of this page

Scroll to Top