Chess Competitions : జిల్లా స్థాయి చెస్ పోటీలు ఈ నెల 17న ఎంపికలు, క్రీడాకారులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

TRINETHRAM NEWS

అరకులోయ ఫిబ్రవరి 15, త్రినేత్రం న్యూస్: పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 17వ తేదీన క్రీడల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు నిర్వాహించడం జరుగుతుందని ఒక ప్రకటనలో అల్లూరి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి తెలిపారు. జిల్లాలో (శాఫ్ లీగ్స్) చదరంగ జిల్లా స్థాయి క్రిడల ఏంపికలు జరుగుతుందని పేర్కొన్నారు.
​​ క్రీడల పట్ల ఆసక్తి, ప్రతిభ గల విద్యార్థినీ విద్యార్థులు చదరంగం (చెస్) పోటీలకు తేది 17.2..2026 ఉదయం 9.గంటల నుండి పాడేరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు ఈ క్రిడల ఎంపికలో పాల్గొనవచ్చునాని, 13,15 మరియు 17 సంవత్సరాల వయస్సు కలిగి ఆశక్తి గల ఉత్సహ వంతులుఅల్లూరి జిల్లా కు సంబందించిన విద్యార్థిని విద్యార్థులు మాత్రమే పాల్గొన వచ్చునని అన్నారు.

ఇతర జిల్లాకు సంబందించిన వారికీ అనుమతించబడదని తెలిపారు. ఎంపికలో పాల్గొనే వారు తప్పనిసరిగా ముందుగానే ఆన్‌లైన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఈజిల్లా స్థాయి పోటీలలో కనబరిచిన (గెలిపొందిన)వారికీ రాష్ట్ర స్థాయి (శాఫ్ లీగ్స్) చదరంగ పోటీలలో జిల్లా తరుపున పాల్గొంటారు అని తెలిపారు, ఆసక్తిగలవారు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (web: https://sports.ap.gov.in/#/ registration/saap-league- registration)ద్వారా నమోదు చేసుకోవాలి. ఇందుకు సంబందించిన వివరాలు సంప్రదించుటకు గల ఫోన్ నెంబర్లు.6303193400 మరియు 9000274225 ను సంప్రదించ గలరు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District level chess competitions selections

You cannot copy content of this page

Scroll to Top