Fire Accident : చౌటుప్పల్‌లో బృందావనం ఫార్మా రియాక్టర్లు పేలుడు
Trinethram News : చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని బృందావనం ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలాయి. ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, నలుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో కంపెనీలో 11 మంది ఉద్యోగులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

