వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దేశాయిపేట రోడ్ లో ఒయాసిస్ పబ్లిక్ పాఠశాలలో శనివారం రోబోటిక్ ఫైర్ ఘనంగా నిర్వహించిన పాఠశాల చైర్మన్ డాక్టర్.జె.ఎస్. పరంజ్యోతి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు పాల్గొని రోబోటిక్ ప్రదర్శనను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు మాట్లాడుతూ.. మానవుల కంటే విశ్వాసి నియంగా పనులు చేసేందుకు వ్యాపార పారిశ్రామిక రంగంలో రోబోటోలు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయియని తెలిపారు. ఈరోజుల్లో ప్రమాదకరమైన వైరస్ కు గురికాకుండా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనుషులకు సాధ్యం కాని పనులను ప్రమాదకరమైన మొండి పనులను చేసేందుకు రోబోలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ జె.ఎస్. పరంజ్యోతి మాట్లాడుతూ… ఉత్పాదకత నిర్మాణ ప్యాకింగ్ రవాణా భూమి అంతరిక్ష అన్వేషణ శాస్త్ర చికిత్స ఆయుధ తయారీ ప్రయోగశాల పరిశోధనలు వినియోగదారుల పారిశ్రామిక ఉత్పత్తులను భారీ స్థాయిలో కార్యకలాపాలకు కూడా రోబోటులను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన శాస్త్రీయ ఆలోచన సమస్యల పరిష్కరించే నైపుణ్యాలు తదితర ప్రదర్శనలు పలువురిని ఆకర్షించాయి .ఈ ప్రదర్శనను జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు తిలకించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


