ఘనంగా దీక్ష దివాస్ కార్యక్రమం లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరిష్ రెడ్డి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ప్రధాన చౌరస్తాలో నవంబర్ 29 దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరిష్ రెడ్డి వారి చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం వ్యాల్ల హరిష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమచరిత వేల పుటల బృహత్ గ్రంథం. ఉద్యమ పథంలో కీలక పరిణామాలు, మరుపురాని సందర్భాలు కోకొల్లలు. కానీ రాష్ట్రసాధన ఉద్యమాన్ని మలుపుతిప్పి, గెలుపు వైపు నడిపించిన అరుదైన ఘట్టం దీక్షా దివస్! అది కేసీఆర్ సంకల్ప బలానికి, దీక్షాదక్షతకు సాక్ష్యం! అది అరవై ఏండ్ల పోరాటానికి క్లైమాక్స్ ఎపిసోడ్ ఆ 11 రోజులు.. తెలంగాణ నలుదిశలను ఏకం చేసింది. ‘ప్రత్యేక రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో!’ ‘కేసీఆర్ శవయాత్రో..
తెలంగాణ జైత్రయాత్రో!’ అని గర్జించేంత ధైర్యం, తన ఉద్యమంపై నమ్మకం ఏ నాయకుడికి ఉంటుంది? ఒక్క కేసీఆర్‌కు తప్ప. అందుకే రాష్ట్ర సాధన కోసం రణగర్జన చేసి కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష. గల్లీ గల్లీనీ కదలించింది. ఢిల్లీని వణికించింది! 2009 నవంబర్ 29 వలస పాలనపై అంతిమ సమరానికి సన్నద్ధమైన తెలంగాణం పోరు గడ్డపై నిలబడి తెలంగాణ తరఫున కేసీఆర్ చేసిన ఆమ ‘రణం’ఒక్క పిలుపుతో కేసీఆర్ వెంట నడిచిన తెలంగాణ జన సైన్యం..ముక్కోటి తెలంగాణ బిడ్డల ఆకాంక్షలే ఆయన కవచం పోరు భూమిలో మరణానికి ఎదురు వెళ్లిన కేసీఆర్ మొండి ధైర్యం.అకుంఠిత దీక్షను చూసి ఆసేతుహిమాచలం ఆశ్చర్య పోయిన వైనం తెలంగాణ ప్రకటన రూపంలో కేసీఆర్ సాధించిన అద్భుత విజయం తెలంగాణ స్వ రాష్ట్ర పోరాటానికి సగర్వంగా జై కొడుతూ..
కేసీఆర్ అద్భుత పోరాటాన్ని స్మరించుకుంటూ.దీక్షా దివస్‌ను జరుపుకుందాం..అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ కార్పొరేటర్ ఐత శివ కుమార్,రమణ రెడ్డి,రవి నాయక్, బక్కి కిషన్, మెరుగు చంద్రమొగిలి,జాహిద్ పాషా,కృష్ణ స్వామి, అనుముల కళావతి, పరుశ స్వాతి,రామస్వామి, అల్లి గణేష్, బోట్ల పోషం,బూరుగు వంశీక్రిష్ణ,అత్తరుదిన్, బోట్ల పోషం,ఉదయ్, శ్రీనివాస్ రావు,సిగిరి రాము,నడిపల్లి సాయి,షరీప్,తిరుమల్,గొర్రె శంకర్, గొర్రె నర్సింగ్,కొండ సురేష్,అనిల్,పోయిల రవి,శ్యామ్, ప్రవీణ్, యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


