Collector Koya : సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పనుల పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

పెద్దపల్లి, జూలై 29: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గడువు లోగా రామగుండం నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పనుల పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నగర కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ సంప్ నిర్మాణ పనులు పూర్తి చేసి శుక్రవారం నాటికి త్రాగునీటి సరఫరా చేయాలని కలెక్టర్ మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులను ఆదేశించారు.

రోడ్లు భవనాల శాఖ పరిధిలో జరిగే రోడ్డు విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల నేపథ్యంలో అవసరమైన త్రాగు నీటి పైప్ లైన్ షిఫ్టింగ్ పనులు వీలైన ప్రాంతంలో ప్రారంభించాలని అన్నారు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి పురోగతిలో ఉన్న పనులు పూర్తి చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో త్రాగు నీటి సరఫరా పనులను ఒకసారి పరిశీలించాలని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎంపిక చేసిన స్థలాలలో పనులు ప్రారంభం కావాలని అన్నారు ఈ సమావేశంలో ఆర్ & బి ఈఈ భావ్ సింగ్, ఈ ఈ ఇంట్రా శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Koya Sri Harsha

You cannot copy content of this page

Scroll to Top