వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పరిసర ప్రాంతంలోని కొత్రేపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాటేషన్ డ్రైవ్ లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని అదేవిధంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అధిక దిగుబడి వచ్చే విత్తనాలను రైతులకు అందించాలని మంత్రి సూచించారు. జిల్లాలో పెద్ద మొత్తంలో ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసినట్లయితే రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఫ్యాక్టరీని శంకుస్థాపన చేసుకుందామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా రైతు భరోసా, రైతు బీమా పథకాలను అమలుపరుస్తున్నామని, త్వరలోనే పంటల బీమా ను కూడా వర్తింప చేస్తామని మంత్రి తెలిపారు.
శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రాముఖ్యత నిస్తూ రైతుల సంక్షేమం కోసంపనిచేస్తుందన్నారు.ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోనే వ్యవసాయ రంగం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని, రైతులను రుణ బారం నుండి విముక్తులను చేయడానికి 25 లక్షల మంది రైతులకు చెందిన 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందని సభాపతి తెలిపారు. రైతు భరోసా ను ఏడాదికి ఎకరాకు 12 వేలకు పెంచి కేవలం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగిందని ఆయన అన్నారు. .
మన వికారాబాద్ జిల్లాలో మంచి సారవంతమైన ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ హష్మీన్ భాష, డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ , జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి సత్తార్, వ్యవసాయ శాఖ అధికారి రాజా రత్నం, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


