Women’s Gym : మహిళల జిమ్ ను ప్రారంభించండి

TRINETHRAM NEWS

తేదీ : 29/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నగర కార్పొరేషన్ మెయిన్ పార్కులో హైదరాబాదు దివిస్ లాబరేటరీ వాళ్లు లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన మహిళా జిమ్ ను తక్షణమే ప్రారంభించాలని, ఆమె పది హెను వ డివిజన్ మాజీ కౌన్సిలర్ మున్సిపల్ మాజీ ఉప ప్రతిపక్ష నాయకురాలు లంకి శెట్టి. వనిజ డిమాండ్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ దాతల ముందుకు వచ్చిన , అధికారులు, పాలకవర్గం స్పందించకపోవడం అత్యంత శోచనీయమని విమర్శించారు.
లక్షల రూపాయలతో దాతలు ముందుకు వస్తే స్వాగతించవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. పార్కుకి వచ్చే సందర్శకులు, విమర్శలు అధికారులకు వినపడడం లేదా? అని సంబంధిత అధికారులను ప్రశ్నించడం జరిగింది. మచిలీపట్నం పాలకవర్గం రాజీనామా చేయడం , ఉత్తమ మార్గం అని తెలిపారు. భోగరాజు , పట్టాభి సీతారామయ్య భవనానికి యూనియన్ బ్యాంకు వాళ్లు రూపాయలు నలభై కోట్లు ఇస్తామంటే ఎందుకు స్పందించడం లేదని అన్నారు. స్థానిక కోనేరు సెంటర్ లో మహిళలకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని , సుదీర్ఘంగా ఉన్న సమస్యను పరిష్కరించడంలో పాలకవర్గం విఫలమైందని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా రోజు విడిచి రోజు కేవలం అరగంట మంచినీరు ఇవ్వడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారని , పెరిగిన జనాభా దృష్ట్యా మరో అదనపు సమ్మర్ స్టోరేజ్ బ్యాంకు ను వంద ఎకరాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి భోగరాజు, పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి మరియు ప్రధాన మున్సిపల్ పార్కులోని మహిళల జిమ్ ని ప్రారంభించడానికి నగర కార్పొరేషన్ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని , తగిన ఆదేశాలు ఇవ్వాలని వనజ కోరారు. జిమ్ లో బిగించినటువంటి సామాగ్రి ఎండకు వెండి, వానకు తడిసి ప్రారంభం కాకముందే పాడైపోయే ప్రమాదం ఉందని , తక్షణమే షెడ్ ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ ను కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Start a women's gym

You cannot copy content of this page

Scroll to Top