ప్రతిభావంతులైన విద్యార్థులకు తోడ్పాటు జిల్లా కలెక్టర్  కోయ హర్ష

TRINETHRAM NEWSఆర్చరీ క్రీడాకారిణి కాంపౌండ్ బో అందజేసిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, అక్టోబర్-07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలో క్రీడలకు సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన తోడ్పాటు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ..

TRINETHRAM NEWS

ఆర్చరీ క్రీడాకారిణి కాంపౌండ్ బో అందజేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, అక్టోబర్-07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో క్రీడలకు సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన తోడ్పాటు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  కోయ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  తన చాంబర్ లో ప్రతిభా వంతురాలైన ఆర్చరీ క్రీడాకారిణి జి.అర్చనకు కాంపౌండ్ బో పంపిణీ చేశారు.

ముత్తారం మండలం కాసర్ల గడ్డ గ్రామానికి చెందిన కుమారి జి.అర్చన గత సంవత్సరం జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి క్రీడల కోటాలో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించడం జరిగింది. ఈ విద్యార్థిని ఆర్చరీ తనకు కాంపౌండ్ బో కావాలని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది.

విద్యార్థిని దరఖాస్తు పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్షా 25 వేల 328 రూపాయలను మంజూరు చేస్తూ విద్యార్థినికి అవసరమైన కాంపౌండ్ బో కొనుగోలు చేసి నేడు పంపిణీ చేశారు. విద్యార్థిని భవిష్యత్తులో ఆర్చరీ లో గొప్ప క్రీడాకారిణీగా ఎదగాలని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తోడ్పాటు జిల్లా యంత్రాంగం తరపున అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ  కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page