Collector Koya : ఆగస్టు 10 నాటికి జిల్లాలో మంజూరు చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

TRINETHRAM NEWS

పెద్దపల్లి, జూలై-30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆగస్టు 10 నాటికి జిల్లాలో ప్రతి పంచాయతీ రాజ్ ఏఈ పరిధిలో మంజూరు చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
బుధవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పై సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాబోయే 5 సంవత్సరాల వరకు ఎటువంటి పనులు చేపట్టాల్సిన అవసరం రాకుండా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ తరపున మంజూరు చేసిన అభివృద్ధి పనులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కోడ్ ఇబ్బంది రాకుండా ముందస్తుగా పనులు గ్రౌండ్ చేసి పెట్టుకోవాలని, ఆగస్టు 10 నాటికి ప్రతి ఏఈ పరిధిలో మంజూరు చేసిన పనులు తప్పనిసరిగా ప్రారంభం కావాలని అన్నారు జిల్లాలోని హెల్త్ సెంటర్స్ మరమ్మత్తు పనులు, సబ్ సెంటర్ భవనాలు, పాఠశాలల మరమ్మత్తు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలల ,హస్టల్స్ మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుంటూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, సిపిఓ రవీందర్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector Koya Harsha

You cannot copy content of this page

Scroll to Top