Awareness : శుభ్రత పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతానికి తమ పూర్తి సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు 100 ఆకారంలో నిలిచి ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు సప్తగిరి కాలనీలోని జ్యోతిభా ఫూలే బి సి బాలుర పాటశాల విద్యార్థులు. బుధవారం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగర పాలక సంస్థ అధికారులు , సిబ్బంది ఈ పాటశాల ను సందర్శించి వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా విద్యార్థులు వరుసలో నిలిచి వినూత్నంగా 100 ఆకారాన్ని ప్రదర్శించారు. కాగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అశోక్ నగర్ , గాంధీ నగర్ లలో మురుగు నీటి కాలువల్లో పూడిక తొలగించారు.

సెవెన్ ఎల్ ఇ పి కాలనీ రైల్వే లైన్ , ఇందిరా నగర్ రోడ్డులో పిచ్చి చెట్లు తొలగించారు. మాతంగి కాలనీలో మొక్కలు నాటారు . వివిధ చోట్ల మంచి నీటి స్వచ్చత పరీక్షలు నిర్వహించారు. శిధిలభవనాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఆస్తి పన్ను సరి చేయడానికి క్షేత్ర స్థాయిలో తిరుగుతూ భవనాల ప్రస్తుత కొలతలు నమోదు చేశారు . ఈ కార్యక్రమాలను నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి పర్యవేక్షించగా . ఆర్ ఐ శంకర్ రావు , సానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్ , నాగ భూషణం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ , మెప్మా సి ఓ శ్వేత , వార్డు అధికారులు , సానిటరీ జవాన్లు , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness of cleanliness and

You cannot copy content of this page

Scroll to Top