Distribution of Sarees : గ్రామ పంచాయతీ మహిళా కార్మికులకు చీరల పంపిణి

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) నవంబర్ 09 త్రినేత్రం న్యూస్. డిండి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మేకల సాయమ్మ – కాశన్న దంపతుల కుమారుడు మేకల శివ కుమార్ వివాహం చందన తో ఈనెల 16 ఆదివారం డిండి పట్టణంలోని వి ఏ ఎస్ ఫంక్షన్ హాల్లో జరగనున్నది.
ఈ సందర్బంగా మేకల సాయమ్మ కాశన్న దంపతులు గ్రామ పంచాయతీకి చెందిన మహిళా కార్మికులను పసుపు,కుంకుమలతో సత్కరించి చీరలను పంపిణీ చేసారు . సాయమ్మ కాశన్న దంపతులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ మహిళా కార్మికులకు చీరలను అందజేయడం సంతోషాన్ని కలగజేసిందని గ్రామాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచే కార్మికులను మా కుమారుని వివాహం సందర్బంగా సత్కరించడం గొప్ప అనుభూతి ఇచ్చిందని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of sarees to women workers

You cannot copy content of this page

Scroll to Top