MLA Chirri Balaraju : పట్టాదారు పుస్తకాలు పంపిణీ

TRINETHRAM NEWS

పోలవరం జిల్లా : జనవరి 02: (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం,పి. అంకంపాలెం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను డైనామిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు పంపిణీ చేశారు.

ఆయన మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు.
అదేవిధంగా భూమి హక్కులకు సంబంధించిన పూర్తి స్పష్టత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు సంబంధిత రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వీటి ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of Pattadar Pass Books

You cannot copy content of this page

Scroll to Top