Ponguleti : మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఇళ్ల పంపిణీ: పొంగులేటి

TRINETHRAM NEWS
Distribution of one lakh houses : Ponguleti

Ponguleti : త్రినేత్రం న్యూస్ : Mar 14, 2026, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతమైంది. మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిర్మాణ పనులు నాణ్యతతో, వేగంగా జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి భాగ్యం కల్పించడమే లక్ష్యమని, నిధుల కొరత లేకుండా దశలవారీగా అందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top