Distribution of Clothes : శానిటేషన్ కార్మికులకు దుస్తుల పంపిణీ

TRINETHRAM NEWS

తేదీ : 18/11/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ జీవీఎంసీ నలభై ఆరు వార్డు పరిధిలో అదితి సచివాలయం వద్ద,శానిటేషన్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడానికి ముఖ్యఅతిథిగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ హాజరయ్యారు. శానిటేషన్ కార్మికుల కు సంబంధించి మహిళలకు చీరలు, మగవాళ్ళకి బట్టలు టవల్స్ మరియు వాళ్లు చేస్తున్న చెత్త పారవేయడానికి బండ్లు, పంపిణీ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జీవీఎంస్లో ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి కుటుంబం కోసం పనిచేస్తూ ప్రజల కోసం, పనిచేస్తున్న కార్మికులకు మనమందరం రుణపడి ఉండాలి అని తెలిపారు అని తెలిపారు.ఎండనకా వానానకా రాత్రులు పగల తేడా లేకుండా నిరంతరం ఎంతటి కాలువైన ఎలాంటి మురికి నీటిలోనైనా దిగి ప్రజల కోసం సేవ చేస్తున్న ఈ శానిటేషన్ కార్మికులకు మనం ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. ఇంట్లో నుంచి ప్రజలు తడి చెత్త పొడి చెత్త ఇదే కార్మికులు దాన్ని తీసుకొని వేరువేరు భాగాల్లో చేసి దాన్ని లాక్కొని ఒక ప్రదేశంలో పారవేస్తారు.

ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏమిచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే, మన ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి నిరంతరం విధుల్లో కొనసాగుతున్న శానిటేషన్ కార్మికులు, అలానే ప్రజలు కూడా శానిటేషన్ వర్కర్లకు సహాయం చేయాలి తోడ్పడాలు వాళ్ళకి తోడుగా ఉండాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో, జీవీఎంసీ కో ఆప్షన్ నెంబర్ సేనాపతి అప్పారావు, వార్డు అధ్యక్షులు బలిరెడ్డి గోవిందరాజు, కె. చిన్నా, ఎన్ కృష్ణ,దూది నరసింగరావు, ఎన్ ఈశ్వరరావు, కోటా రామారావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యం సూపర్వైజర్ రామారావు, వార్డు సిఓ వరలక్ష్మి సచివాలయం శానిటేషన్ సెక్రటరీలు, శ్రీను, కిరణ్ భాను, రేష్మ, వార్డు ఆర్పీలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of clothes to sanitation workers

You cannot copy content of this page

Scroll to Top