తేదీ : 18/11/2025. అంబేద్కర్ కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); రామచంద్రపురం నియోజకవర్గం లో, రాష్ట్ర ఎన్జీజీవో రామచంద్రపురం తాలూకా అధ్యక్షునిగా మరో దఫా చిక్కాల సూర్యారావు ఎన్ని కయ్యారు.. ఏపిఎన్ జీ జీవో కార్యాలయంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించారు. సంబంధితఅధికారిగా మండపేట తాలూకా యూనిట్ అధ్యక్షులు జిత్తుగా. మల్లికార్జునుడు, సహాయ ఎన్నికల అధికారిగా మండపేట యూనిట్ కార్యదర్శి ఆర్.మోహన్, అబ్జర్వర్ గా జిల్లా ఫైనాన్స్ అసిస్టెంట్ జి.సుందర్ సింగ్ లు వ్యవహరించారు.
ఈ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. తాలూకా యూనిట్ సహాధ్యక్షులుగా వి.గౌరీశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా ఏ.సద్గురు మూర్తి, ఇమామ్ షరీఫ్, పి.రాజారావు, డాక్టర్ ఎస్ ప్రవీణ్; మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎస్.వరలక్ష్మి, కార్యదర్శిగా నైనాల శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పెట్టా సత్య నారాయణ, జాయింట్ కార్యదర్శులుగా ఏ.శ్రీనివాస్,జి.అశోక్, ఏ. వెంకటరావు,కె.ఈశ్వరి, మహిళా కార్యదర్శిగా వి.రోజామణి, ట్రెజరర్ గా ఎం.కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎం.వి.సుబ్రహ్మణ్యం లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గాన్ని ఏ.పి.ఎన్.జి.జి.ఓ జిల్లా అడ హాక్ కమిటీ చైర్మన్ మాధవరపు వెంకటేశ్వర్లు అభినందించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ కొత్త సభ్యులను చేర్పించడం ద్వారా తాలూకా యూనిట్ ను మరింత బలోపితం చేసే దిశగా అడుగులు వేస్తారని వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సభ్యులు శాలువాలతో, పూలమాలలతో సత్కరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


