ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Distribution cotton seeds

-రైతుల సంక్షేమమే రేవంతన్న సర్కార్ ధ్యేయం

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

Distribution Cotton Seeds : దేవరకొండ డివిజన్/ పి ఎ పల్లి జులై 02, త్రినేత్రం న్యూస్. పీఏపల్లి మండలం, అంగడిపేట రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు ఉచిత పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పాల్గొని రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడారు, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల సాగు వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన ఉచిత పత్తి విత్తనాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రేవంతన్న సర్కార్ కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయం తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెన్నెముక అని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, పీఏ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెర్మటి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు కుక్కల గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ వంగాల, మాజీ సింగిల్ విండో చైర్మన్ తెరా సత్యం రెడ్డి, తేరా మణిపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page