జూలై 11, 2026
TRINETHRAM NEWS
Academic Council Meeting

Academic Council Meeting : దేవరకొండ డివిజన్ జులై 02, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోమునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ కౌన్సిల్ సమావేశం ఘనంగా నిర్వహించారు.

ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి చైర్పర్సన్‌గా అధ్యక్షత వహించారు. కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య మెంబర్ సెక్రటరీగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడారు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్, బోధన–అభ్యాస విధానాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, పరీక్షల నిర్వహణ, పాఠ్యాంశాల అమలు, నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను tc మరింత మెరుగుపరిచేలా పలు కీలక నిర్ణయాలను సమావేశంలో ఆమోదించారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ నామినీలు గా ప్రొఫెసర్ అన్నపూర్ణ ఆర్ఎస్ బుట్టి (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్) , ప్రొఫెసర్ ఎం శ్రీలక్ష్మి (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్) , డాక్టర్ కె శ్రీదేవి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ వ్యవహరించారు.
ఈ సమావేశంలో అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి.కోటయ్య, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ కె.పృథు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి.లింగారెడ్డి, తదితర విభాగాధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page