పోరాటాలకు నిరంతర స్పూర్తి అల్లూరి సీతారామరాజు

TRINETHRAM NEWS

అరకులోయ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు

అల్లూరి జిల్లా అరకులోయ, జూలై 5 (త్రినేత్రం న్యూస్): వీరయోధుడు, గిరిజనుల గర్వకారణం, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని అరకులోయలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరకులోయ క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ శాసన సభ్యులు రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, “అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నత త్యాగబ్రతులు. గిరిజనుల హక్కుల కోసం, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పోరాడిన ఆయన్ని మనం శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. ఆయన ఆశయాల సాధన కోసం మనందరం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా:
శెట్టి రోషిణి, అశోక్, పాంగి చిన్నారావు, స్వాబి రామ్ మూర్తి, పాంగి పరశురామ్, శెట్టి అప్పాలు, దురియా ఆనంద్, పల్టాసింగి విజయ్, శెట్టి ఆనంద్, గుమ్మ నాగేశ్వరరావు, పాంగి నరసింగరావు, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహనీయుడికి ఘననివాళులు అర్పించారు.
ఈ జయంతి వేడుకలు ఉద్యమాల పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించడంతోపాటు యువతకు దేశభక్తిని స్ఫూర్తిగా అందించేందుకు అనుకూలంగా నిలిచాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alluri Seetharama Raju, a

You cannot copy content of this page

Scroll to Top