జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Disaster Management Authority

Disaster Management Authority : రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు సోమవారం కూడా కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

విదర్భ మీదుగా ఉత్తరాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి విస్తరించి ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం (01-06-2026) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

01 జూన్, సోమవారం

▪️పోలవరం, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు, మార్కాపురం,బాపట్ల, పల్నాడు,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

▪️పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ కడప,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

ఆదివారం పల్నాడు జిల్లా అచ్చంపేటలో 44.3 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 43.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా ఉయ్యూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 43.7, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.6, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.4, తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 43.3, బాపట్ల జిల్లా కారంచేడులో 43, గుంటూరు జిల్లా మంగళగిరిలో 42.7 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page