BJP Training : ముగిసిన కరీంనగర్ బిజెపి శిక్షణ తరగతులు

TRINETHRAM NEWS
BJP training classes concluded

2 రోజులు….12 సెషన్స్…. కీలక నేతల దిశా నిర్దేశం…

BJP Training : రెండు రోజులు…. 12 సెషన్స్…., బిజెపి కీలక నేతల దిశా నిర్దేశంతో కరీంనగర్ జిల్లా బిజెపి ప్రశిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. కరీంనగర్ బిజెపిలో వివిధ స్థాయిలో ( రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి ) పనిచేస్తున్న కార్యకర్తలు నాయకుల కోసం శనివారం రోజున తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్ఎండి ) లో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ న మహా అభియాన్ పేరుతో శిక్షణ తరగతులు ప్రారంభించింది. శిక్షణా తరగతులలో 346 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. బిజెపిరాష్ట్ర అధ్యక్షులు ఎన్ . రామచందర్ రావు శిక్షణ తరగతులను ప్రారంభించి పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంస్థాగత బలోపేతం , భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు.

అలాగే పార్టీ నీ మరింత బలోపేతం చేసే దిశలో 12 కీలక అంశాలపై బిజెపి రాష్ట్ర ముఖ్య కీలక నేతలు అయ్యంగారీ ప్రభాకర్ రెడ్డి, దేవకి వాసుదేవరావు, అల్జాపూర్ శ్రీనివాస్ , బండారి శాంతి కుమార్ , రాణి రుద్రమ , , గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , పో రెడ్డి కిషోర్ , రంజిత్ మోహన్, మురళీధర్ రావు , కడగంచి రమేష్ , కరీంనగర్ ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ భాను జి ల ద్వారా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చారు. ఒక్కో అంశంపైబిజెపి ముఖ్య నేతలు 45 నిమిషాలనుండి గంటకు పైగా ప్రసంగించారు. పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతం , లక్ష్యాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి.? అధికారంలోకి రావాలంటే ఏమి చేయాలి..? పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం ఎలా..? ప్రజాక్షేత్రంలో ఏయే కార్యక్రమాలు చేపట్టాలి..? లనే ప్రధాన అంశాలే ఎజెండాగా బిజెపి రెండు రోజుల శిక్షణ తరగతులు జరిగాయి.
శిక్షణ తరగతుల ముగింపు (సమరోప్) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ సి. హెచ్ .విద్యాసాగర్ రావు హాజరై మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాన్ని భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లి, పార్టీ నీ మరింత విస్తరించడానికి కృషిచేయాలన్నారు. శిక్షణ కార్యక్రమాల్లో చెప్పిన విషయాలను , అంశాలను ఆచరించి బిజెపి నీ బలమైన శక్తిగా తీర్చిదిద్ది, సమాజంలో మంచి నాయకులుగా, కార్యకర్తలుగా రాణించాలని ఆకాంక్షించారు.

శిక్షణా తరగతుల్లో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి , మేయర్ కోలగని శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు , జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ , మాడ వెంకటరెడ్డి , బత్తుల లక్ష్మీనారాయణ , జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం వాసుదేవ రెడ్డి , రంగు భాస్కరాచారి, గుర్రాల వెంకట్ రెడ్డి , సాయిని మల్లేశం , ఎర్రబెల్లి సంపత్ రావు , పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, ప్రశిక్షణ కమిటీ బాధ్యులు గుజ్జ శ్రీనివాస్, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, చింతం శ్రీనివాస్ , రాష్ట్ర నాయకులు గుగ్గిలపు రమేష్, మేకల ప్రభాకర్ యాదవ్ , పుప్పాల రఘు , దండు కొమురయ్య లతోపాటు కార్పొరేటర్లు , సర్పంచులు , ప్రజా ప్రతినిధులు , మండలాల , జోన్ అధ్యక్షులు, వివిధ మోర్చా బాధ్యులు , నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top