ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలూ నాయక్.
డిండి (గుండ్ల పల్లి) జూన్07 త్రినేత్రం న్యూస్. డిండి. మండల కేంద్రంలో స్థానిక ఈ జె గార్డెన్ ఫంక్షన్ హాల్ లో డిండి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగాబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలూ నాయక్ విచ్చేసి మార్గదర్శనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 సంవత్సరాల పరిపాలనపై పార్టీ కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తుల కన్నా దేశం గొప్పది అని చెప్పేపాటి భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీ దేశంలో మరేది లేదన్నారు దేశభద్రత దేశ ప్రజల సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి మోడీ ఎక్కడ రాజీ పడటం లేదు సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూరం లాంటి సంఘటనలు దానికి నిదర్శనం అని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం నేడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 స్థానంలోని ఆర్థిక వ్యవస్థను 4వ స్థానం చేర్చిన ఘనత నరేంద్ర మోడీ దేనిని, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని పార్లమెంట్ ఎన్నికలతో అది రుజువు అయిందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వాన నరేందర్ రెడ్డి బిజెపి దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ ఏటి,కృష్ణ, డిండి మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు సింకార్ సైదా, గాయాల రాఘవేందర్ వీళ్ళ సాయికుమార్ సాయి గౌడ్, సంతోష్ అమృత్ అంజి సందీప్ అర్జున్ భాస్కర్ రేణయ్య చింటూ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


