దేవరకొండ డివిజన్ మార్చ్ 09, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం లోని 11 వ వార్డ్ , శేరి పల్లి రోడ్డు గిడ్డంగుల కార్పొరేషన్ నిధుల నుండి మంజూరైన 10 కోట్ల రూపాయలతో, 10, 000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణ పనులకు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు , అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ రైతులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ప్రాధాన్యత అని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, మరియు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సదుపాయం కల్పించడంలో ఈ గోదాం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనాల దృష్యా మౌళిక వసతులు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


