జూన్ 27, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ మే 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం -కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బొడ్రాయి (నాభిశిల ) తృతీయ వార్షిక మహోత్సవ కార్యక్రమానికి హాజరై,గ్రామ దేవతలను దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.

గ్రామ దేవత ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలందరిపై ఉండి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే గారు ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి,PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, జడ్పీటీసీ సలహాదారుడు యుగంధర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page