జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ జులై 21 త్రినేత్రం న్యూస్.. దేవరకొండ పట్టణంలోని పి పి ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో *శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , నియోజకవర్గ అన్ని మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపీపీలు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వరి ధాన్యం క్వింటాలుకి 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి వివిధ పథకాలు ఇప్పటికే ప్రజలకు అందించామని ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు.
అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ అభ్యర్థిని ఎంపిక చేస్తుందో అందరూ కలిసి ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉందని అన్నారు . ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వరి ధాన్యం క్వింటాలుకి 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి వివిధ పథకాలు ఇప్పటికే ప్రజలకు అందించామని ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda Constituency Congress Party

You cannot copy content of this page