తేదీ : 24/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం గ్రామం గాంధీ బొమ్మ సెంటర్లో గత నలభై సంవత్సరాల నుండి చిరు వ్యాపారులు కూరగాయలు, పూల కోట్లు, టీ , ఫ్రూట్ దుకాణాలు పెట్టుకొని జీవించడం జరుగుతుంది. వారిని పోలీసులు, రెవెన్యూ పంచాయతీ అధికారులు, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రోక్లైన్లతో ధ్వంసం చేశారు. దుర్మార్గమని జిల్లా కలెక్టర్ ని జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని గన్నవరం జడ్పిటిసి అన్నవరపు.
వెలిజబెత్ రాణి ఆర్జీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. బాధితుల కు జరిగిన ఘటనపై వారి ఆవేదన నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించాను అని పేర్కొన్నారు. బాధితులతో మాట్లాడిన తరువాత తమరికి తెలియజేస్తున్నాను , మొదట ఖాళీ చేయమని అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ వీరికి జీవనాధారం చూపకుండా వారిని భయ బ్రాంతులకు గురిచేసి షాపులను ధ్వంసం చేయడం న్యాయమేనా? అన్నారు. అందువలన జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. బాధితులకు నిరసనగా ఆందోళనకు దిగుతారని తమరికి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


