తేదీ : 24/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, కుదప గ్రామ సచివాలయంలో ఘనంగా గ్రామ పంచాయతీ రాజ్ వారోత్సవాలు జరిగాయి. మీ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు నాయకులు పాల్గొని వందరోజుల ఉపాధి పథకం గురించి , అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఒక్కొక్క పథకం విధులు చేయుట జరుగుతుందని తెలిపారు.
ఉపాధి హామీ పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె. రాజు, గ్రామ తహసిల్దారు యస్ కె. జాన్ ,యం పి టి సి పి. శ్రీనివాసరావు, అధికార పార్టీ గ్రామ అధ్యక్షులు పి. సత్యనారాయణ, గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జి. రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


