జూలై 16, 2026
TRINETHRAM NEWS
Delivery in Ambulance

Delivery in Ambulance : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : అంబులెన్స్‌లోనే ఓ మహిళ ప్రసవించిన ఘటన సిద్ధిపేట(D) రాయపోల్(M)లో జరిగింది. అనాజీపూర్ గ్రామానికి చెందిన సౌందర్య అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు.

అంబులెన్స్‌లో ఆమెను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు.. ఆ మహిళ పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page