Delhi blast : ముంబై చేరిన ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు.. ముగ్గురు అనుమానితుల అరెస్టు

TRINETHRAM NEWS

Trinethram News : న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో 15 మంది మృతిచెందిన ఘటనపై విచారణ తాజాగా ముంబైకి చేరింది. ఈ ఘటనకు సంబంధించిన మూలాలు వివిధ రాష్ట్రాల్లో కనిపించడంతో సోదాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా, ఇతర డిటిజల్ మాధ్యమాల ద్వారా ఈ కేసుతో సంబంధం కలిగిన వ్యక్తులను కనిపెట్టడంపై కేంద్ర ఏజెన్సీలు దృష్టిసారించినట్టు ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.

ముంబైలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ఏజెన్సీలు తాజాగా చేపట్టిన కోవర్ట్ ఆపరేషన్‌లో ముగ్గురు అనుమానితులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ విద్యాధికులే కాకుండా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులను తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ కేసులో నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులు ప్రధాన నిందితుడితో ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్‌ ద్వారా సంప్రదింపులు సాగించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నారు. కీలకమైన సమాచారాన్ని పంచుకునేందుకు వారు ఆ యాప్ వాడినట్టు అనుమానిస్తున్నారు. విచారణలో వెలుగుచూస్తున్న సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో తుదుపరి గాలింపు చర్యలు ఉంటాయని చెబుతున్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Delhi blast investigation reaches Mumbai

You cannot copy content of this page

Scroll to Top