వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని బి ఆర్ ఎస్ భవన్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సన్నాహక సమావేశం లో పాల్గొన్న వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి మరియు రోహిత్ రెడ్డి* వికారాబాద్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు దీక్షా దివస్ నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈనెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించుకుందాం అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టీ ఎస్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ , బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ , రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షులు రామ్ రెడ్డి జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ వికారాబాద్ జిల్లా బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కే గోపాల్ ముదిరాజ్ మరియు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


