WhatsApp Image 2023 12 26 at 11.02.44 AM
నైజీరియాలో మారణ హోమం.. 160 మంది మృత్యువాత
నైజీరియాలో సాయుధ మూకలు మారణ హోమానికి పాల్పడ్డారు. బండిట్స్ అని పిలిచే సాయుధ మూకలు నైజీరియా లో కొన్ని తెగలకు చెందిన ప్రజలనే లక్ష్యంగా చేసుకుని వారు నివసిస్తున్న గ్రామాల్లో కాల్పులకు తెగబడ్డారు. వారి ఇళ్ళల్లో చొరబడి చిత్ర హింసలు పెట్టారు.
ఈ దారుణ మారణకాండలో దాదాపు 160 మంది మృత్యువాత పడగా 300 పైగా తీవ్రంగా గాయ పడ్డారని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ నైజీరియాలో 2009 నుంచి మత, సామాజిక పరమైన విభేదాల కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి.
