WhatsApp Image 2023 12 26 at 11.02.56 AM
ప్రకృతి జల ప్రళయ విలయం సునామీ కి సరిగ్గా 19 యేళ్లు
సరిగ్గా 19 యేళ్ళ క్రితం ఇదే రోజున భారీ ప్రకృతి జల ప్రళయ విలయ తాండవం చేసిన రోజు.2004 డిసెంబర్ 26న రిక్టార్ స్కేల్ పై 9.3 తీవ్రత తో సునామీ వచ్చింది.ఈ సునామీ భారత దేశంతో సహా 13 దేశాలులో తీవ్ర విషాదం మిగిల్చింది.
2.3 లక్షల మందిని రాకాసి సముద్రపు అలలు మింగేసాయి. మన దేశం లోనే 12వేల మంది జలసమాధి అయ్యారు. సముద్ర అలల ధాటికి పడవలు,కార్లు, ఇళ్లు సర్వ నాశనం అయ్యాయి.
ఈ విషాద ఛాయలు బాధితులను ఇప్పటికీ వెంటాడుతున్నాయి..
