సెప్టెంబర్ 6, 2026
TRINETHRAM NEWS
Death Ramavath Bichya Naik

—దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్.

Death Ramavath Bichya Naik : దేవరకొండ డివిజన్ ఆగష్టు 11, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం పెద్ద తండాకు చెందిన రమావత్ బిచ్య నాయక్ మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం పెద్ద తండాలో బిచ్య నాయక్ మృతదేహానికి రమావత్ రవీంద్ర కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ…..బిచ్య నాయక్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామావత్ నర్సింహ, శేరిపల్లి సర్పంచ్ రమావత్ బలరాం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page