
అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి… తీదేడు గ్రామ సర్పంచ్..
Shekhar Reddy : చింతపల్లి ఆగస్టు 11 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని తీదేడు గ్రామంలో నూతన పింఛన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి గ్రామం లోని ప్రజను కోరారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని,అర్హత కలిగిన వారు అవసరమైన ధ్రువపత్రాలతో నూతన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పింఛన్ పొందేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలోని అర్హులైన ప్రజలు నూతన పింఛన్ల కోసం దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.అర్హులైనవారందరుప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు,ఉలుపాల శేఖర్ రెడ్డి, గ్రామస్తులు సిమర్ల శ్రీను యాదవ్,వీరమల్ల వెంకటయ్య,మొరుపోజు లక్ష్మిపతి,కలగోని మల్లయ్య,మర్ల బచ్చయ్య,వీరమల్ల యాదయ్య,మునగాల రవి,మునగాల అశోక్,బృంగి వెంకటేశం,యాతం రామలింగమ్మ, సోనగంటి ఉమా, తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe