WhatsApp Image 2023 12 27 at 8.28.16 AM
EC: ఏపీ సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా విడుదల తేదీ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను 2024 జనవరి 5వ తేదీకి బదులుగా జనవరి 22న విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
జనవరి 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని ఏపీ సహా 12 రాష్ట్రాల ఎన్నికల సీఈవోలను ఆదేశించింది. జవనరి 17వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో తుది సవరణలకు అవకాశం ఉంది.
