పేదల భూములకు, ఇళ్లకు పట్టాలు పంపిణీ మరియు రెవెన్యూ సదస్సులో అధిక ప్రాధాన్యత కల్పించాలి. – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు మండలం ) జిల్లాఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు).
అల్లూరి సీతారామరాజు జిల్లా.
పేదల భూములకు, ఇళ్లకు పట్టాలు పంపిణీ చేయాలి.
రెవెన్యూ సదస్సుల్లో అధిక ప్రాధాన్యత నివ్వాలని, ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్.
రాష్ట్రంలోని పేదల ఇళ్లకు, భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో దీనికే అధిక ప్రాధాన్యత నివ్వాలని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఈ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేనటువంటి రైతులు వేల సంఖ్యలో ఉన్నారని, అలాగే గ్రామాల్లోనూ, పట్టణాల్లో కూడా ఇళ్ల పట్టాలు లేని వారు లక్షల సంఖ్యలో ఉన్నారని అన్నారు. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన భూ దురాక్రమణ చట్టం దుర్మార్గమైనదని, పేదవాళ్లను ఖాళీ చేయించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే దురుద్దేశంతోనేనని విమర్శించారు. పేదల ఇళ్లకు, భూములకు రక్షణ కల్పించి రెవెన్యూ సదస్సులో వీరికి పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల లోపు మెట్ట భూమికి ఈ చట్టం నుంచి మినహాయింపు నివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఉండే రెవెన్యూ భూముల వివాదాలను గ్రామ సభలో పరిష్కరించాలని అన్నారు. చుక్క భూముల పేరుతో రైతుల భూములకు పట్టాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్న వంటి ఘటనలపై సుమారు పన్నెండు లక్షల మంది రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పి వి టి జి గిరిజనుల పట్ల వివక్షత,
అల్లూరి జిల్లాలోని పదహారువందల గ్రామాల్లో జీవిస్తున్న పివిటిజి తెగల, గిరిజనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్షపాత ధరణి మీ నిర్లక్ష్యాన్ని, అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. 2006 సంవత్సరంలో వచ్చిన అటవీ భూముల హక్కుచట్టం కింద పూర్తిస్థాయిలో పట్టాలు ఇంకా పంపిణీ కాలేదని అన్నారు. అలాగే టైగర్ జోన్, ఎన్విరాన్మెంట్ పేరుతో ఇంకా గిరిజనుల పోడు భూముల నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అటవీ భూముల హక్కు పత్రాలు పంపిణీ చేయాలని, డిమాండ్ చేశారు. పీఎం జన్ మన్ పథకం కింద పివిటిజీలకు గృహ నిర్మాణానికి రెండు లక్షలు ఇస్తే సరిపోదని ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని, ఆయన డిమాండ్ చేశారు.
అదాని నుంచి పోర్టులకు విముక్తి కల్పించాలి.
అదాని పేరు ఎత్తడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వణుకిపోతోందని,
అదానీ కంపెనీ పోర్టులు విద్యుత్తు హైవేలు పేరుతో రాష్ట్రాన్ని కబ్జా చేస్తోందని గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదానీ చేతుల్లోంచి పోర్టులకు విముక్తి కల్పించి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉక్కు ప్రైవేటీకరణ పై విశాఖ సభలో సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాథం మాట్లాడుతూ నేడు విశాఖపట్నం వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా, జరుగుతున్న పోరాటంపై స్పందించి ఈ సభలో దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గిరిజన డీఎస్సీ నిర్వహించడం కోసం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం ఇచ్చిన హామీల అమలుపై సీఎం ఒక స్పష్టతను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి అప్పల నరస మాట్లాడుతూ జిల్లాలోని నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గ్రామాలను ఐదవ షెడ్యూల్ లోకి మార్పు చేసి వాటిని రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే పీసా కమిటీ ఎన్నికలు పదేళ్ల నుంచి జరగలేదని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామసభల ఆమోదం లేకుండా ఏజెన్సీలో మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని,ఇది పీసా కమిటీకి విరుద్ధమని ఆయన అన్నారు. ఇరవై రోజులుగా దీక్షలు చేస్తున్న గురుకుల ఔట్సోర్సింగ్ టీచర్ల పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గమని, వెంటనే వీరిని కాంట్రాక్ట్ టీచర్లుగా గుర్తించి రెగ్యులరైజేషన్కు చర్యలు తీసుకోవాలని,త్వరలో నిర్వహించే డీఎస్సీ నుంచి ఈ పోస్టులను మినహాయించాలని, ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సురేంద్ర పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App