CPI : ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని 5 న జరిగే ధర్నాలను జయప్రదం చేయండి

TRINETHRAM NEWS

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, సామర్లకోట ఆగస్టు 03: విద్యుత్ చార్జీల నిలువు దోపిడీ ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు వివిధ ప్రజా సంఘాల ప్రజా వేదిక నాయకత్వంలో దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని అందులో భాగంగా ఈనెల ఐదున జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు

ఆదివారం ఉదయం సామర్లకోటలో బస్టాండ్ రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్ మీదుగా ప్రజలను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు ఐదున జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచి రూ32 వేల కోట్ల భారం ప్రజలపై మోపిందని ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ ఇక నుండి ఈ బాధలు ఉండదని మేము అధికారులకు వస్తే చార్జీలు పెంచబోమని తగ్గిస్తామని ఎన్నికల ప్రణాళికల హామీలు ఇచ్చి నేడు ఆ హామీని విస్మరించడం దారుణం అన్నారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని లోకేష్ ఆనాడు పిలిపిచ్చారని నేడు అదే స్మార్ట్ మెట్లు ఇంటింటికి బిగిన్తున్నారని లోకేష్ ప్రజలను నమ్మకద్రోహం చేశారని మధు విమర్శించారు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి పాలకులు పూనుకుంటున్నారని ఆదాని కంపెనీ రాష్ట్రంలోని రెండు కోట్ల మంది వినియోగదారులకు పాత మీటర్లు తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఇది మీటర్ మార్పు మాత్రమే కాదు విధానం మార్పు అని విద్యుత్ పంపిణీ ప్రైవేటుకరణకు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్రలో భాగమని మధు పేర్కొన్నారు ఈ మేటర్ ఖర్చు సింగల్ ఫేస్ కు 9000 త్రీ ప్లస్ కి 17,000 93 నెలల్లో వాయిదారి పద్ధతిలో జనం నుండే వసూలు చేస్తారని తర్వాత మళ్లీ మీటర్ మార్చుకోవాల్సింది మళ్లీ డబ్బు కట్టాల్సిందే గంట గంటకు రీడింగ్ తీస్తారని పగల కంటే రాత్రి వాడి కరెంటుకు అధిక బిల్లులు వేస్తారని వేసవికాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేస్తారని ఈ స్మార్ట్మీటర్లతో తో ప్రజలు పారిపోవాల్సిందేనని ఆయన తెలిపారు అదాని స్మార్ట్ మీటర్లు ఆపే వరకు పెట్టిన మీటర్లు తొలగించే వరకు ట్రూ ఆఫ్ చార్జీలు విధానాన్ని తొలగించే వరకు అదనపు బాలలు తగ్గించేవరకు ఈ దశల వారి పోరాటం చేస్తామని ఆగస్టు 5వ తేదీన విద్యుత్ ప్రభుత్వ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనలతో సంతకాలతో వినతి పత్రాలతో ప్రజలు తరలి రావాలని మధు పిలుపునిచ్చారు

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కే బోడకొండ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పీ సత్యనారాయణ ప్రజానాట్యమండలి జిల్లా కన్వీనర్ మండగల రమణ అర్జున్ రావు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కౌన్సిలర్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Make the dharna on the 5th

You cannot copy content of this page

Scroll to Top