ఆగస్ట్ 17, 2026
TRINETHRAM NEWS

Trinethram News : రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాని మోదీపై రైతు సంఘాలు మండిపడ్డాయి. మోదీ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 12న దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), ఏఐకేఎస్‌ సహా పలు రైతు సంఘాలు శనివారం ప్రకటించాయి.

ఈ ఒప్పందం ద్వారా మోదీ ప్రభుత్వం అమెరికాకు పూర్తిగా సాగిలా పడిందని ఎస్‌కేఎం విమర్శించింది. అమెరికా బహుళజాతి సంస్థల ఒత్తిళ్లు, డిమాండ్లకు పూర్తిగా లొంగిపోయిన వాణిజ్య శాఖ మంత్రి గోయల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఒప్పందం ఒప్పందం వల్ల పాల ఉత్పత్తులతో పాటు పలు వ్యవసాయ పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నేత కృష్ణ ప్రసాద్‌ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Countrywide protests on 12th Kannera by farmers'

You cannot copy content of this page