త్రినేత్రం న్యూస్, మండపేట, దళితుల ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వేగుళ్ళను కర్నూల్ ఉపా లోకయుక్త కోర్టులో ఇచ్చిన తీర్పుకు దళితులుగా మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? అనేది మేము సూటిగా వేసిన ప్రశ్న దానికి సమాధానం ఇవ్వకుండా పొంతన లేని మాటలతో కాలక్షేపం చేస్తున్న మీకు మీరే సాటి అని కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ మండిపడ్డారు. మండపేట పట్నం 7వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ 48 లక్షల 95 వేలుతో మున్సిపాలిటీ సాధారణ నిధుల ద్వారా రిలీజ్ చేసిన ఘనత తోట త్రిమూర్తులుదే అన్నారు. మీ టిడిపి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే వేగుళ్ల పలుమార్లు కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతూ నేనే ఆపానని గంటాపదంగా చెప్పడం నిజం కాదా మీరు దళితులయితే మద్దతిస్తారా తెలపాలన్నారు. దళితులు పట్ల వైసిపి పార్టీ విధానాలు నచ్చక పార్టీ ఫిరాయించినట్లు చెప్తున్న కొవ్వాడ బేబీ అప్పన్నబాబు వైసిపి పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఇప్పటికీ, కొనసాగుతున్నారు, కానీ పదవికి రాజీనామా చేసి మాట్లాడితే మీరు మాట్లాడే మాటకి అర్థం ఉంటుంది. లేకపోతే మీ అవకాశ దిగజారుడు వెన్నుపోటు రాజకీయాలకు నిదర్శనంగా ఉందన్నారు.
11వ వార్డులో 60 లక్షలు అభివృద్ధి పనులు అనుమతులు పొంది కూడా ముందుకొచ్చిన కాంట్రాక్టర్ని చేయనివ్వకుండా నువ్వు చేయ్యకుండా వార్డు అభివృద్ధిని అడ్డుకున్న అసమర్థ స్వార్థపు కౌన్సిలర్ గా దళిత ద్రోహిగా ఆ పాపం మూటకట్టుకున్నది మీరేనని ప్రజలు బాహాటంగానే చెపుతున్నారని రవి ఆక్షేపించారు. పలు సందర్భాలలోనూ పత్రికాముఖంగా కూడా మా నాయకుడు త్రిమూర్తులు ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు కాదు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చిన నేత తోట అందుకనే ఒక అన్నలా ఇంటికి పెద్ద కొడుకులా ప్రజలకు ఇబ్బంది వస్తే త్రిమూర్తులకు చెప్తే తీరుతుంది అన్న నమ్మకంతో వచ్చే వాళ్ళందరికీ మీ నాయకుడు వేగుళ్ల జోగేశ్వరరావు లాగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి కోర్టులకు వెళ్ళండి అని చెప్పకుండా ఆ సమస్యను పరిష్కరించి వాళ్లకి న్యాయం చేసే గుణాన్ని మీరు సెటిల్మెంట్ అనే పేరుతో తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన రాష్ట్రవ్యాప్తంగా తోటకు ఉన్నటువంటి పేరును మీరు అంగుళం కూడా కదపలేరన్న సంగతిని గుర్తుంచుకుంటే మంచిదని రవి హితవు పలికారు.
సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్న మీ వాదనను ఖండిస్తూ, మారేడుబాక గ్రామం నుండి దళిత మహిళ న్యాయం చేయమని నీ వద్దకు వస్తే నువ్వు లైంగికంగా వేధించిన తీరుపై విసుగుచెంది నీపై పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైతే నువ్వు వెనకేసుకొస్తున్న దళితవాడలు అభివృద్ధిని అడ్డుకునే మీ నాయకుడు నిన్ను సమర్ధిస్తూ దళితజాతి ఆడబిడ్డకు అన్యాయం చెయ్యడానికి ప్రోద్బలం చేస్తున్న దళిత ద్రోహులు మీరే కదా అని ముమ్మిడివరపు బాపిరాజు ఆరోపించారు.
కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 2024 టిడిపి అధికారంలో రాగానే ఎమ్మెల్యే జోగేశ్వరరావు 8వ వార్డులో 30 సంవత్సరాలుగా మాంసం వ్యాపారం చేస్తున్న దుకాణాలను తొలగించినప్పుడు మీరంతా ఏమైయ్యారని అప్పుడు మీకు మన జాతి గుర్తుకురాలేదా అని అంటూ ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి తొలగించారో గుర్తుచేసుకుంటే దళితుల ద్రోహులు ఎవరు అనేది తేటతెల్లం అవుతుందని అదేవిధంగా జాతీయ నాయకుల విగ్రహాల సెంటర్ పక్కన ఉన్న మున్సిపల్ షాపులను దళితులకి ఏర్పాటుచేసిన షాపులకు మా వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు అద్దెలు పెరగనివ్వకుండా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కృషి చేయడం జరిగింది, కానీ మీ టిడిపి అధికారం రాగానే అద్దెలు పెంచి వాళ్ళ జీవనోపాధిపై దెబ్బ కొట్టి భారం మోపింది మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే వేగుళ్ల కాదా అని ప్రశ్నించారు.
మండపేట నియోజకవర్గంలో మూడు మండలాల ఎంపీపీలు మున్సిపల్ చైర్ పర్సన్ మీ వైసీపీదే కదా అని వేగుళ్ళ ప్రస్తావించినటువంటి మాటలను మర్చిపోయారా అని గుర్తు చేస్తూ మీరు మాట్లాడే మాటలు విడ్డూరంగా ఉన్నాయని విపర్తి సింహాచలం ప్రస్తావిస్తూ మండలాలు మున్సిపాలిటీ తీర్మానాలు మా వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆదేశాలు లేకుండానే మీకు వచ్చాయని మీరు చెప్పుకోవడం, హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు అభివృద్ధి జరిగింది అని చెప్పడమే గాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉన్నటువంటి వేగుళ్ళ చేసిన ఒక్క మంచి కార్యక్రమాన్ని చూపగలరా అంటూ రామచంద్రాపురం రెవిన్యూ డివిజన్, బస్సు కాంప్లెక్స్, జిల్లా కోర్టు, అగ్రికల్చర్ కాలేజీ, డివిజనల్ కరెంట్ ఆఫీస్, డిఎస్పీ ఆఫీస్ లు వంటివి ఏర్పాటుచేసుకున్న దమ్మున్న నాయకుడు తోట త్రిమూర్తులు అని సింహాచలం కొనియాడారు.
జాతి నాయకుల విగ్రహాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని కనికెళ్ళపల్లవి ప్రసాదులు అన్నారు మన జాతి విలువలను గౌరవించి మహనీయుల ఆశయాలను ప్రజలకు తెలియచేయాలని మండపేట నడిబొడ్డున కౌన్సిల్ ఆమోదముతో త్రిమూర్తులు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తే మీరు వక్రీకరిస్తూ స్వార్థం చూసుకున్నారని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మీరు చెబుతున్న పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది మీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కాదా అని పల్లవి ప్రసాద్ లు గుర్తుచేస్తూ మున్సిపల్ చైర్మన్ ఇప్పించిన మహనీయుడినే వెన్నుపోటు పొడిచిన ఘనత మీ నాయకుడిది కదా అని ప్రశ్నించారు.
క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం వైయస్సార్ ప్రభుత్వంలో త్రిమూర్తులు ఆధ్వర్యంలో మండపేట మున్సిపాలిటీ నుండి సాధారణ నిధులతో 38 లక్షలు గ్రాండ్ ని రిలీజ్ చేసి టెండర్లను పిలిచి ఆ కాంట్రాక్ట్ కు వర్క్ ఆర్డర్ నీ ఇప్పించి తర్వాత పని మొదలు పెట్టేసరికి ఎలక్షన్ కోడ్ తో తదనంతరం టీడీపీ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంకా పనులు చేస్తూనే ఉంటూ వాడుకలోకి తేవకపోవడం మీ అసమర్ధత కదా అని కొడమంచలి భాస్కరరావు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత నాయకులంతా ముక్తకంఠంతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితుల కోసం, అభివృద్ధి కోసం మాట్లాడే అర్హత మీకు లేదని మీరు దళిత ద్రోహులని ఘంటాపదంగా చెప్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


