ఎంపీడీవోకి వినతిపత్రం అందచేసిన అనపర్తి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ కన్వీనర్ కొండేటి భీమేశ్వర స్వామి , బిసి సెల్ విభాగం నాయకులు.
అనపర్తి: అనంత బుల్లెటిన్ ప్రతినిధి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన బీసీ మహిళల కుట్టుమిషన్ శిక్షణ తరగతులు మరియు కుట్టు మిషన్ పంపిణీటెండర్లలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి జరిగింది అని అవినీతిపై విచారణ జరపాలని అనపర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ విభాగం నాయకులు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కొండేటి భీమేశ్వర స్వామి ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం సమర్పించారు.
దాదాపు ఒక్కొక్క లబ్ధిదారుని కి 23 వేల రూపాయలు కేటాయించారు. వాస్తవంగా ఒక బీసీ లబ్ధిదారునికి కుట్టు మిషన్ మరియు శిక్షణకు మొత్తం ఖర్చు 7300 రూపాయలు, ప్రభుత్వం 23000 వేల రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారునికి ఖర్చుగా చూపిస్తూ ప్రభుత్వ ధనం దాదాపు 167 కోట్లు వృధా చేస్తున్నారు అని, రాష్ట్ర వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పిలుపు మేరకు ఈ టెండర్ల బాగోతంపై ప్రచారం జరపాలని రాష్ట్రవ్యాప్తంగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారని బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మేము వ్యతిరేకం కాదని ఈ పథకాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకులు అధికారులు పాల్పడుతున్న అవినీతికి వ్యతిరేకమని వీరు అన్నారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి ఎంపీటీసీ బండారు శ్రీనివాసరావు, బీసీ నాయకులు కానూరి కృష్ణారావు, చిట్టూరు ఏసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


