
ప్రజాపాలనలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజాప్రభుత్వ ధ్యేయం.
Continuous Efforts : దేవరకొండ డివిజన్ మే 14, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ భావన నిర్మాణ పనులకు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
కొండమల్లేపల్లి పట్టణంలోని కులం, మతం, రాజకీయాలకు అతీతంగా పేదల ఆత్మగౌరవపు చిరునామ, ఇందిరమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తుంది. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లను విజయవంతంగా లబ్దిదారులకు అందించామనీ తెలిపారు. రెండవ విడత, మూడవ విడత, నాల్గవ విడతలో కూడ గూడులేని ప్రతి పేదవాడికి ఇల్లు అందించే లక్ష్యంగా ప్రతి గ్రామం, పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు, స్థానిక ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
డ్రైనేజీ పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు సమస్యలు తగ్గి ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కొండమల్లేపల్లి గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు చరిత్రలో నిలిచేలా అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు. డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపం లేకుండా చూడాలని అధికారులను సూచించారు.
దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన అన్ లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

