Nenavat Balu Naik : ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందించాలి

TRINETHRAM NEWS

నేనావత్ బాలు నాయక్

దేవరకొండ సెప్టెంబర్ 24 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో అదనపు ఎస్పీ మౌనిక , ఆర్ డీ ఓ రమణా రెడ్డి మరియు వ్యవసాయ శాఖ అధికారులతో ఎం ఎల్ ఏ బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేవరకొండ నియోజవర్గంలో ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వల గురించి వ్యవసాయ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయని కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని,జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సరిపడా యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి,అదనపు ఎస్పీ మౌనిక గారు, ఆర్ డి ఓరమణా రెడ్డి , ఏ డీ ఏ శ్రీలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పి ఎ సీ ఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బిక్కు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్,అన్ని మండలాల ఏ ఒ లు, సి ఈ ఓ లు,పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Every farmer should be provided with the necessary urea

You cannot copy content of this page

Scroll to Top